సమగ్ర శిక్షా ఉద్యోగుల వేతనాలు చెల్లించండి

సమగ్ర శిక్షా ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated : 29 Feb 2024 06:22 IST

ప్రభుత్వానికి హరీశ్‌రావు డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర శిక్షా ఉద్యోగుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఆచరణలో మాట తప్పింది. గతేడాది డిసెంబరు నెలకు సంబంధించి 10,632 మంది.. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్షా ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లించాలి’’ అని హరీశ్‌రావు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని