TS News: వచ్చే ఏడాది కాసుల గలగలలే..!

ప్రభుత్వానికి సమకూరే రాబడుల్లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం ప్రధానమైనది. రాష్ట్రంలో భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లతో ఏటా రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.

Updated : 01 Mar 2024 08:36 IST

పుంజుకుంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
ఎల్‌ఆర్‌ఎస్‌తో భారీగా పెరుగుతుందని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వానికి సమకూరే రాబడుల్లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం ప్రధానమైనది. రాష్ట్రంలో భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లతో ఏటా రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. కరోనా సమయంలో వృద్ధి సన్నగిల్లగా గత ఏడాది నుంచి క్రమంగా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 26 నాటికి ఈ శాఖకు కేవలం భూముల రిజిస్ట్రేషన్ల ద్వారానే రూ.11,386 కోట్లు సమకూరింది. ఈ ఏడాది కొంతమేర పెరిగి రూ.11,480 కోట్లు నమోదయింది. ఇతర రాబడులతో కలిపి చూస్తే గత ఏడాది రూ.12,901 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.13,120 కోట్ల మేర సమకూరింది. మార్చి నెలాఖరు నాటికి గత ఏడాది మొత్తం రూ.14,291 కోట్ల రాబడి లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకన్నా రూ.200 కోట్లు ఎక్కువ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో మరింత వృద్ధి..

రాష్ట్రంలో అనుమతి లేని లే-అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థిరాస్తి రంగం కొత్తపుంతలు తొక్కనుంది. లే-అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రాబడి గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని