తెలంగాణలో మళ్లీ పంటల బీమా

కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో తెలంగాణ మళ్లీ చేరుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Published : 02 Mar 2024 05:11 IST

వచ్చే పంట కాలం నుంచి పీఎం ఫసల్‌బీమా యోజన అమలు
కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శికి స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)లో తెలంగాణ మళ్లీ చేరుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతులకు దన్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని,  వారికి రక్షణగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి, పీఎంఎఫ్‌బీవై సీఈవో రితేశ్‌ చౌహాన్‌ సమావేశమయ్యారు. 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఈ పథకంలో ఉందని, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి వైదొలిగిందని రితేశ్‌ తెలిపారు. కేంద్ర పథకంపై చర్చల అనంతరం తెలంగాణ.. మళ్లీ పథకంలో చేరుతుందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రితేశ్‌ హర్షం వ్యక్తంచేశారు. వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందుతారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని