‘క్రిష్‌’ ముందస్తు బెయిలు పిటిషన్‌పై వివరణివ్వండి

మాదకద్రవ్యాల కేసులో గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసులో సినీ దర్శకుడు క్రిష్‌ ముందస్తు బెయిలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Published : 02 Mar 2024 06:45 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసులో గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసులో సినీ దర్శకుడు క్రిష్‌ ముందస్తు బెయిలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ వినియోగించారన్న ఆరోపణపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ క్రిష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మొదటి నిందితుడైన జి.వివేకానంద ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌ను పదో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారన్నారు.  దర్యాప్తునకు అవసరమైనపుడు పిటిషనర్‌ హాజరవుతారని, కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటారని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 4కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని