రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా సుమారు రూ.15,718 కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Published : 02 Mar 2024 04:09 IST

ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
4, 5 తేదీల్లో పర్యటన
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా సుమారు రూ.15,718 కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆదిలాబాద్‌, సంగారెడ్డిలలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని పర్యటించనున్నారు. 4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్ల ప్రాజెక్టులు, సంగారెడ్డిలో రూ.9,021 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. 5న సంగారెడ్డి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తొలుత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని