మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్‌

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒబేదుల్లా కొత్వాల్‌ నియమితులయ్యారు.

Published : 02 Mar 2024 04:11 IST

పాలమూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒబేదుల్లా కొత్వాల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. గత 38 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి చిన్నారెడ్డి తర్వాత అంతటి సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌ పురపాలక ఛైర్మన్‌గా 2005 నుంచి 2010 వరకు ఉన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షునిగా 11 ఏళ్లు పనిచేశారు. ఆయన నియామకంపై పలువురు కాంగ్రెస్‌  నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని