పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభలు 9, 10న

పౌర, ప్రజాస్వామిక, హక్కుల పరిరక్షణ ప్రస్థానంలో పౌర హక్కుల సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో నగరంలో సభలు నిర్వహించనున్నారు.

Published : 02 Mar 2024 04:12 IST

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: పౌర, ప్రజాస్వామిక, హక్కుల పరిరక్షణ ప్రస్థానంలో పౌర హక్కుల సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో నగరంలో సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, నేతలు సురేశ్‌కుమార్‌, గుంటి రవి తదితరులు గోడపత్రికలు ఆవిష్కరించారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సభలు నిర్వహిస్తామన్నారు. వీటికి విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్‌ పాత్రికేయులు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. హరగోపాల్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పౌర హక్కుల సంఘంలో చేరి పని చేస్తానని తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. సంఘాలు సభలు పెట్టుకునేందుకు వీల్లేని పరిస్థితి కల్పించారు. దేశంలో నిర్బంధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ స్వయంగా కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ మావోయిస్టు సానుభూతి పార్టీ అని వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని