3 నుంచి ఖమ్మంలో ఐక్యత మహాసభలు

ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ, ఫాసిస్టు విధానాలతో పాలన సాగిస్తున్న భాజపాకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని విప్లవశక్తులను ఏకం చేస్తున్నామని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ప్రజాపంథా ముఖ్యనేతలు పోటు రంగారావు, ప్రదీప్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు.

Published : 02 Mar 2024 04:49 IST

ఈటీవీ-ఖమ్మం: ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ, ఫాసిస్టు విధానాలతో పాలన సాగిస్తున్న భాజపాకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని విప్లవశక్తులను ఏకం చేస్తున్నామని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ప్రజాపంథా ముఖ్యనేతలు పోటు రంగారావు, ప్రదీప్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం వేదికగా ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడురోజుల పాటు ఐక్యత మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం నగరంలో ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు జర్మనీ, నేపాల్‌ ప్రతినిధులతోపాటు దేశంలోని 16 రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని