తెలంగాణలో రానున్న ఐదు రోజులూ ఎండలే..

రాష్ట్రంలో ఎండలు అప్పుడే మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.

Published : 03 Mar 2024 06:50 IST

శనివారం పలు జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు అప్పుడే మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, ఖమ్మం జిల్లా మధిర, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని