జేఎన్‌టీయూకు ఏ ప్లస్‌ గ్రేడ్‌: అధికారికంగా ధ్రువీకరించిన న్యాక్‌ బృందం

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో న్యాక్‌ గుర్తింపు, ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది.

Updated : 03 Mar 2024 09:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో న్యాక్‌ గుర్తింపు, ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) బృందం సభ్యులు శనివారం అధికారికంగా ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించారు. గత ఏడాది ఏ గ్రేడ్‌ మాత్రమే రావటంతో జేఎన్‌టీయూ అధికారులు అప్పీలుకు వెళ్లారు. 90వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్‌పై ఈ గ్రేడింగ్‌ ప్రభావం చూపనుందని దరఖాస్తులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంపై నివేదిక పంపగా.. కొద్దిరోజుల క్రితం జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను న్యాక్‌ బృందం సభ్యులు సందర్శించారు. పరిశోధన వివరాలు గమనించిన బృందం ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించింది. దీనిపై వీసీ కట్టా నరసింహారెడ్డి ఆచార్యుల బృందాన్ని అభినందించారు. రాబోయే సంవత్సరంలో ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ సాధించేలా కృషి చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని