ఫోన్‌ చేస్తే.. సత్వర న్యాయం

దళిత, గిరిజన ఉద్యోగులు విధి నిర్వహణలో వేధింపులు ఎదుర్కొంటున్నా, వివక్షకు గురైనా, పదోన్నతుల్లో సమన్యాయం దక్కలేదని భావించినా.. తమకు ఫోన్‌ కాల్‌ చేస్తే సత్వరం న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు.

Published : 03 Mar 2024 03:46 IST

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ వెంకటయ్య

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దళిత, గిరిజన ఉద్యోగులు విధి నిర్వహణలో వేధింపులు ఎదుర్కొంటున్నా, వివక్షకు గురైనా, పదోన్నతుల్లో సమన్యాయం దక్కలేదని భావించినా.. తమకు ఫోన్‌ కాల్‌ చేస్తే సత్వరం న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో.. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సమస్యలు తలెత్తితే 9849991418, 040-23236182 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు. కమిషన్‌ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. తెజస అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగంలో మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ విప్‌ ఆరెపల్లి మోహన్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని ఉన్నతాధికారులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయవచ్చని రాజ్యాంగంలో ఉందన్నారు. వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాతాంగి శ్రీనివాస్‌, రాష్ట్ర కన్వీనర్‌ దానయ్యలు మాట్లాడుతూ తమకు రోస్టర్‌ కమ్‌ సీనియారిటీ కల్పించడంతోపాటు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు. అనంతరం తమ సమస్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డైరీని వక్తలంతా ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని