పేదలకు న్యాయసేవలు చేరువ కావాలి

మారుమూల గ్రామాల్లోని పేదలకు న్యాయసేవలు చేరువ కావాలని హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Published : 03 Mar 2024 03:48 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌

దమ్మపేట, న్యూస్‌టుడే: మారుమూల గ్రామాల్లోని పేదలకు న్యాయసేవలు చేరువ కావాలని హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేటలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌, జస్టిస్‌ కె.శరత్‌, జస్టిస్‌ భీమపాక నగేశ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ వేణుగోపాల్‌ మాట్లాడారు. దేశంలోని అన్ని కోర్టుల్లో నిరంతర తీర్పులు ఇచ్చినా.. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి 33 ఏళ్ల సమయం పడుతుందని జస్టిస్‌ భీమపాక నగేశ్‌ పేర్కొన్నారు.  చిన్న చిన్న సమస్యలను కోర్టుల వరకు తేవడం వల్ల న్యాయస్థానాల విలువైన సమయం వృథా అవుతుందన్నారు. అంతకుముందు కోర్టు భవనం ఆవరణలో హైకోర్టు న్యాయమూర్తులు మొక్కలు నాటారు. వారిని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు, స్థానిక పెద్దలు సత్కరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి వసంత్‌ పాటిల్‌, సత్తుపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాకలపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం దమ్మపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా కొత్తగూడెం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రామారావు బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు