కామర్స్‌లో ప్రతిభ.. ఐదు ఉద్యోగాలకు ఎంపిక

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమత ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు.

Published : 03 Mar 2024 07:45 IST

పెగడపల్లి, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమత ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. బీఈడీ, ఎం.కాం. పూర్తి చేసిన మమత.. ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవుతూనే సిరిసిల్ల గురుకుల డిగ్రీ కళాశాలలో కొద్దికాలంగా కాంట్రాక్టు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. గురుకుల నియామక పరీక్షలో కామర్స్‌ విభాగంలో రాష్ట్రస్థాయి 16వ ర్యాంకుతో డిగ్రీ లెక్చరర్‌, రాష్ట్రస్థాయి ఆరో ర్యాంకుతో జూనియర్‌ లెక్చరర్‌, సోషల్‌ విభాగంలో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు సాధించారు. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో రాష్ట్రస్థాయి 23వ ర్యాంకుతో మున్సిపల్‌శాఖలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కామర్స్‌లో ప్రతిభ వల్లే తనను ఈ ఉద్యోగాలు వరించాయని.. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులో చేరి విద్యార్థులకు సేవలు అందిస్తానని మమత తెలిపారు. యువతి తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమ దంపతులు.. తమ కుమార్తె సాధించిన ఉద్యోగాలపట్ల హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని