నెట్‌ స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్‌ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని  యూజీసీ సూచించింది.

Published : 28 Mar 2024 03:16 IST

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్‌ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని  యూజీసీ సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్‌ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్షతోపాటు నెట్‌ నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. 2024-25 నుంచి నెట్‌ స్కోరుతో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది. జేఆర్‌ఎఫ్‌తో పీహెచ్‌డీ ప్రవేశం, సహాయ ఆచార్యుల నియామకం, పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్‌ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని