భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు

రాయదుర్గం టీ హబ్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్‌) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు.

Published : 28 Mar 2024 03:25 IST

ఆ దేశ రాయబారి థియరీ మాథావు
టీహబ్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ కార్యాలయ శాఖ ప్రారంభం

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం టీ హబ్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్‌) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయానికి అనుబంధ శాఖగా దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలున్నాయని చెప్పారు. గతేడాది భారత ప్రధాని ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవానికి హాజరు కాగా ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవాలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు విచ్చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారని, అందులో భాగంగా నగరంలో శాఖ ఏర్పాటు చేశామని చెప్పారు. 2025లో ఫ్రాన్స్‌-ఇండియా ఇన్నోవేషన్‌ ఇయర్‌ (ఫ్రాన్స్‌-భారత్‌ ఆవిష్కరణల దినోత్సవం) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాలయం ద్వారా ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించడతోపాటు వాణిజ్యం, దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తామన్నారు. ఏటా తమ దేశంలో వివాటెక్‌ పేరుతో నిర్వహించే ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ వేడుకలకు దేశవిదేశాలతోపాటు భారత్‌, తెలంగాణ నుంచీ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భారత్‌లో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ థియరీ బెర్తెలాట్‌, టీహబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, సీఐఓ సుజిత్‌ జాగిర్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని