యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి

భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు.

Published : 28 Mar 2024 05:19 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. దైవారాధనల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఆలయ ఈవో భాస్కర్‌రావు స్వాగతం పలికారు. పంచనారసింహుల దర్శనంతో ఆధ్యాత్మికతతో పాటు పవిత్ర అనుభూతిని పొందానని క్షేత్ర సందర్శకుల (వీవీఐపీల) విజిట్‌ బుక్‌లో ఆయన తన అభిప్రాయం రాశారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని