రెండు రోజుల్లో జస్టిస్‌ ఘోష్‌కు ‘ఉత్తర్వుల’ ప్రతి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్‌కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌కు నీటిపారుదల శాఖ అందించనుంది.

Published : 28 Mar 2024 03:22 IST

బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ కార్యాలయం?

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్‌కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌కు నీటిపారుదల శాఖ అందించనుంది. దీనికోసం ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా నేతృత్వంలో అధికారుల బృందం రెండు రోజుల్లో కోల్‌కతాకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ కమిషన్‌ కోసం హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో కార్యాలయం కేటాయించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 30లోగా కమిషన్‌ విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు జస్టిస్‌ ఘోష్‌ను కలిసి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేయడంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వివరాలను అందజేయనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని