రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు

రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది.

Published : 28 Mar 2024 03:23 IST

గత నవంబరులో వీరి సంఖ్య 7,689..
ప్రస్తుతం 6,292కు చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఈ ఓటర్లు 7,689 మంది ఉన్నారు. నాటి  జాబితాతో పోలిస్తే వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు 1,397 మంది తగ్గడం గమనార్హం.

తొలిసారి ఓటర్లు 8,51,853 మంది

గత నెలలో ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా.. వయసుల వారీగా వివరాలతో అధికారులు ప్రస్తుతం జాబితా రూపొందించారు. దీని ప్రకారం 8,51,853 మంది తొలిసారి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు సుమారు 1.55 లక్షల మంది అధికంగా ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి వందేళ్ల వయసు దాటిన అన్ని విభాగాల్లోనూ మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. కేవలం 18 నుంచి 29 సంవత్సరాల వయసు ఓటర్లలో మాత్రమే పురుషులు అధికంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని