చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ

హోలీ రోజు హైదరాబాద్‌ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 28 Mar 2024 05:16 IST

పోలీసు వలయాన్ని ఛేదించుకొని వెళ్లిన నేతలు, కార్యకర్తలు

చెంగిచర్ల (బోడుప్పల్‌), న్యూస్‌టుడే: హోలీ రోజు హైదరాబాద్‌ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేని ప్రాంతానికి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో బండితో పాటు వచ్చిన కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. భాజపా, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసు వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకువెళ్లారు. కొందరు కింద పడిపోయారు. వారిని కట్టడి చేయడం కష్టం కావడంతో పోలీసులు హైరానా పడ్డారు. చివరికి పార్థీబస్తీకి చేరుకున్న బండి సంజయ్‌ హోలీ నాటి ఘటనపై స్థానికులతో మాట్లాడారు. బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని ధ్వజమెత్తారు. యంత్రాంగం పక్షపాత వైఖరిని వీడాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిపల్లి సీఐ మాట్లాడుతూ.. ఘటనపై విచారణ కొనసాగుతుందని, త్వరలోనే దోషులను పట్టుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని