చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..

మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది.

Published : 28 Mar 2024 03:45 IST

మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. ఎస్సారెస్పీ జలాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. దీంతో నీటి కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు సమీపంలో రైతు ఏర్పుల వెంకన్న తనకున్న రెండెకరాల్లో వరి వేయగా ఎకరం పంట ఎండిపోయింది. మిగిలిన పంట కాపాడుకోవడానికి రూ.20 వేలు వెచ్చించి ఆకేరు వాగులో యంత్రంతో 15 ఫీట్ల లోతు వరకు బావి తవ్వించి మోటారు బిగించారు. మొదట్లో నీరు సమృద్ధిగా వచ్చినా ఎండలు పెరగడంతో భూగర్భజలాలు ఇంకిపోయాయి. దీంతో ఇలా బావిలో చెలమను తోడి వచ్చిన జలాలతో అరగంటకు ఒకసారి మోటారు సహాయంతో పంటకు నీరు అందిస్తున్నారు.

న్యూస్‌టుడే, నర్సింహులపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని