పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించండి

బూటకపు పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.

Published : 29 Mar 2024 02:46 IST

సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: బూటకపు పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీని, దాని మిత్రపక్షాలను, ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజలను మళ్లీ మోసం చేసి అధికారం దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, న్యాయ వ్యవస్థల స్వేచ్ఛను మోదీ దెబ్బతీశారని లేఖలో ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని