సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్‌ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 29 Mar 2024 02:49 IST

ఎన్నికల రోజుల్లో వేతనంతో కూడిన సెలవు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్‌ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలోనూ అదే రోజున పోలింగ్‌ ఉండడంతో తెలంగాణలో ఉంటున్న ఆ రాష్ట్ర ఓటర్లకూ ఇది వర్తిస్తుంది. అయితే ఇతర సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌ , మహారాష్ట్ర, కర్ణాటకలలో వేర్వేరు తేదీల్లో పోలింగ్‌ ఉండగా.. తెలంగాణలో పనిచేస్తున్న ఆ రాష్ట్రాల వారికి కూడా వెసులుబాటు కల్పించింది. ఆయా రోజులను వేతనంతో కూడిన సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న దినసరి కూలీలు, కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి సొంత ప్రాంతాలకు వెళ్లడం ద్వారా రోజువారీ ఆదాయాన్ని కోల్పోకూడదని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని