జెన్‌కో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష వాయిదా

పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, కెమికల్‌) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన కంప్యూట్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్‌కో సీఎండీ తెలిపారు.

Published : 29 Mar 2024 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, కెమికల్‌) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన కంప్యూట్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్‌కో సీఎండీ తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత పరీక్ష నిర్వహిస్తామని, తదుపరి తేదీ వివరాలను టీఎస్‌జెన్‌కో వెబ్‌సైట్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని