ఇంటర్‌ కళాశాలలకు మే 31 వరకు సెలవులు

రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది.

Published : 29 Mar 2024 02:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. మళ్లీ జూన్‌ 1న పునఃప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నెల 30 చివరి పనిదినంగా పేర్కొంది. వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలకు వర్తిస్తాయని, ఈ ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. వచ్చే విద్యా సంవత్సరానికి బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని