రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 29 Mar 2024 03:37 IST

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏటా ఆలయంలో కాముడిదహనం తరవాత శివ కల్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పార్వతీ, రాజరాజేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకీ సేవపై తీసుకొచ్చి కల్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివార్ల పెళ్లి క్రతువును స్థానాచార్యుడు అప్పాల భీమశంకర్‌శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ దంపతులు, పురపాలక సంఘం తరఫున కమిషనర్‌ అన్వేష్‌ కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి శివపార్వతులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని