భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత

మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి బెల్లం అశోక్‌ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు.

Updated : 29 Mar 2024 09:19 IST

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి బెల్లం అశోక్‌ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రిలోని సీఐఎస్‌ఎఫ్‌ కాలనీలోని అశోక్‌ ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి అచ్యుత్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌,  కేటీఆర్‌,  బాల్కసుమన్‌ చిత్రాలు ముద్రించి ఉన్న 32 గోడ గడియారాలతోపాటు 130 మద్యం సీసాలను(23.4 లీటర్లు) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని