తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం

చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది.

Published : 29 Mar 2024 03:38 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. గురువారం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన సభకు సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు బి.నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు. పురస్కార గ్రహీతలను రూ.20,116 నగదు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిన్న కోడూరుకు చెందిన కొంకుళ్ల ఎల్లయ్య బృందం ప్రదర్శించిన చెంచులక్ష్మి యక్షగానం అలరించింది. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకులు రామ్మూర్తి పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కార గ్రహీతలు వీరే....

వైద్యం వేంకటేశ్వరాచార్యులు(కవిత్వం), డా.డి.రాజారెడ్డి(పరిశోధన), అన్నవరం శ్రీనివాస్‌(చిత్రలేఖనం), టి.గంగాధర్‌(శిల్పం), డా.పసుమర్తి రామలింగశాస్త్రి(నృత్యం), డా.పప్పు వేణుగోపాలరావు(సంగీతం), ఆర్‌.దిలీప్‌రెడ్డి(పత్రికారంగం), బీహెచ్‌ కల్యాణి(నాటక రంగం), కొంకుళ్ల ఎల్లయ్య(జానపద కళారంగం), డా.గండ్ర లక్ష్మణరావు(అవధానం), ఆచార్య కొలకలూరి మధుజ్యోతి(ఉత్తమ రచయిత్రి), దేవులపల్లి కృష్ణమూర్తి (నవల/కథ).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని