వేడెక్కిన తెలంగాణ

సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి.

Published : 29 Mar 2024 03:38 IST

నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీలు నమోదు
11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రానున్న మూడు రోజులూ తీవ్ర ఎండలే

ఈనాడు, హైదరాబాద్‌: సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో 43.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాదికి ఇదే రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. మొత్తం 11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకుపైగా నమోదయినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ నివేదికలో పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌, ఆదిలాబాద్‌లలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని