హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్‌రెడ్డి, ఎం.విజయ్‌కుమార్‌, చిక్కుడు ప్రభాకర్‌, ఎ.జగన్‌ పోటీ పడ్డారు.

Published : 29 Mar 2024 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్‌రెడ్డి, ఎం.విజయ్‌కుమార్‌, చిక్కుడు ప్రభాకర్‌, ఎ.జగన్‌ పోటీ పడ్డారు. రవీందర్‌రెడ్డి 968 ఓట్లు సాధించి.. సమీప ప్రత్యర్థిపై 32 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షురాలిగా ఎ.దీప్తి, ప్రధాన కార్యదర్శులుగా యు.శాంతిభూషణ్‌రావు, జె.సంజీవ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా వి.నవీన్‌కుమార్‌, కోశాధికారిగా కె.శ్రావ్య, స్పోర్ట్స్‌, కల్చరల్‌ కార్యదర్శిగా అభిలాష్‌ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా కె.శ్రీధర్‌, కార్యనిర్వాహక సభ్యులుగా డి.వి.శ్రీకాంత్‌, జి.సుందరేశన్‌, కె.గణపతి, మహ్మద్‌ హబీబుద్దీన్‌ గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని