పార్వతీ బ్యారేజీ నీటి విడుదల నిలిపివేత

కాళేశ్వరం ప్రాజెక్టులోని పార్వతీ బ్యారేజీ నుంచి గురువారం రాత్రి దిగువన గోదావరిలోకి నీటిని వదిలారు.

Published : 30 Mar 2024 04:11 IST

మంథని, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని పార్వతీ బ్యారేజీ నుంచి గురువారం రాత్రి దిగువన గోదావరిలోకి నీటిని వదిలారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న బ్యారేజీలో ప్రస్తుతం 1.75 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా బ్యారేజీ నుంచి నీటిని వదలాలని జాతీయ డ్యాం భద్రత సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) ఆదేశాల మేరకు గురువారం రాత్రి 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని బ్యారేజీ ఈఈ ఓంకార్‌సింగ్‌ తెలిపారు. తిరిగి శుక్రవారం ఉదయం నీటి విడుదల నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆపేసినట్లు చెప్పారు. మరోవైపు పార్వతీ బ్యారేజీ నుంచి నీటి విడుదలతో మంథని తీరం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. నదిలో స్నానానికి వచ్చే భక్తులు లోపలికంటూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని