ఎవరి బాధ వారిదే!

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో 21ఆర్‌, 22ఆర్‌ ఎస్సారెస్పీ ఉపకాల్వల కింద సుమారుగా 9వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

Published : 30 Mar 2024 04:17 IST

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలంలో 21ఆర్‌, 22ఆర్‌ ఎస్సారెస్పీ ఉపకాల్వల కింద సుమారుగా 9వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాట్ల సమయంలో గోదావరి జలాలు రావడంతో రైతులంతా వరిసాగు చేశారు. అధికారులు ఇప్పటివరకు మూడు దఫాలుగా నీటిని విడుదల చేయగా..ఈ కాల్వల పరిధిలో ఒక్కసారి మాత్రమే నీరు వచ్చింది. ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేశారు. అప్పులు చేసి ఒక్కొక్కరు సుమారుగా మూడు నుంచి నాలుగు బోర్లు వేసుకున్నారు. అయినా నీరు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అటు గోదావరి నీళ్లు రాక..ఇటు వేసిన బోర్లు పడక పంటను వదిలేసుకునే పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల చేస్తే సంగం పంటైనా దక్కుతుందని రైతులు కోరుతున్నారు. అన్ని కాల్వలకు నీరందించడానికి ప్రయత్నిస్తున్నామని చిన్ననీటిపారుదల శాఖ డీఈ హరికృష్ణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

న్యూస్‌టుడే, నూతనకల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని