నీటిపారుదల శాఖ సీఈ వి.రమేశ్‌ కన్నుమూత

నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజినీరు, వాలంతరి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ వి.రమేశ్‌ గురువారం రాత్రి ఆకస్మికంగా మరణించారు.

Published : 30 Mar 2024 04:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజినీరు, వాలంతరి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ వి.రమేశ్‌ గురువారం రాత్రి ఆకస్మికంగా మరణించారు. అదే రోజు తన ఏకైక కుమారుడి నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో నిద్రలోనే కన్నుమూశారని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. నీటిపారుదల శాఖలో గతంలో పలు సర్కిళ్లలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. రమేశ్‌ మరణం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని