ముద్కేడ్‌-మన్మాడ్‌ రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి

ముద్కేడ్‌-మన్మాడ్‌ సెక్షన్‌లోని బ్రాడ్‌గేజ్‌ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 30 Mar 2024 04:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముద్కేడ్‌-మన్మాడ్‌ సెక్షన్‌లోని బ్రాడ్‌గేజ్‌ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెక్షన్‌లో మిర్ఖల్‌-మాల్టేకిడి మధ్య మిగిలిన 43.4 కి.మీ మార్గంలో కూడా విద్యుదీకరణ పనులు తాజాగా పూర్తయ్యాయి. జోన్‌ పరిధిలోని నాందేడ్‌ రైల్వే డివిజన్‌ పాత బ్రాడ్‌గేజ్‌ మార్గాలన్నింటినీ విద్యుదీకరించినట్లు వివరించింది. ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’లో భాగంగా ‘మన్మాడ్‌-ముద్కేడ్‌-డోన్‌’ మార్గాన్ని విద్యుదీకరించేందుకు 2015-16లో రూ.865 కోట్ల నిధులు మంజూరు చేయగా దశలవారీగా ఆ పనులు పూర్తయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని