సంక్షిప్త వార్తలు (4)

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన, ఇతర సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, గౌరవవేతనం కింద నియమించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది.

Updated : 31 Mar 2024 05:14 IST

కలెక్టర్ల ఆధ్వర్యంలో బోధన సిబ్బంది నియామకాలు
ఎన్నికల కమిషన్‌ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన, ఇతర సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, గౌరవవేతనం కింద నియమించేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చోంగ్తు ఆదేశాలు జారీ చేశారు.


జెన్‌కో ఈడీ అజయ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

ఈనాడు, హైదరాబాద్‌: జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ), సివిల్‌ విభాగం డైరెక్టర్‌ అజయ్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు చేసుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ సీఎండీ రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో సివిల్‌ డైరెక్టర్‌ హోదాలో పనులను పర్యవేక్షిస్తున్న అజయ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి ఆయన ఈడీ పోస్టులో ఉండగా గత ప్రభుత్వం సివిల్‌ డైరెక్టర్‌గా నియమించింది. ఇంకా ఏడాది సర్వీసు ఉంది. జెన్‌కోలో డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త డైరెక్టర్ల నియామకం చేపడితే.. తనను కిందిస్థాయి పోస్టు అయిన ఈడీగా మళ్లీ పంపుతారని భావిస్తూ ఆయన వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.


ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి కొత్త కార్యవర్గం

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మారం భరత్‌రెడ్డి, చోళ ఓంప్రకాశ్‌ యాదవ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో నూతన కార్యవర్గం ఏర్పడింది. కోశాధికారిగా ప్రసాద్‌రావు, సహాధ్యక్షుడిగా మదన్‌మోహన్‌రావు, ఇతర కార్యవర్గసభ్యులు ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది.


రేపు ఐచ్ఛిక సెలవు దినం

షహదత్‌ హజ్రత్‌ అలీని పురస్కరించుకొని ఏప్రిల్‌ 1వ తేదీని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మార్చి 31ని ప్రకటించగా దాన్ని తాజాగామార్చినట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని