ఇంటర్‌ 2024-25 విద్యా క్యాలెండర్‌ విడుదల

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌ విద్యామండలి శనివారం విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

Updated : 31 Mar 2024 05:13 IST

227 పనిదినాలు, 75 సెలవులు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్‌ క్యాలెండర్‌ను ఇంటర్‌ విద్యామండలి శనివారం విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఆ సంవత్సరం కళాశాలలకు 227 పని దినాలు, 75 సెలవులు ఉంటాయని వివరించింది. దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 13 వరకు, సంక్రాంతి సెలవులు 2025 జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. ప్రీఫైనల్‌ పరీక్షలు 2025 జనవరి 20 నుంచి 25 వరకు జరుగుతాయి. అన్ని జూనియర్‌ కళాశాలల్లో 2025 మార్చి 29 చివరి పని దినంగా ఉంటుంది. మార్చి 30 నుంచి జూన్‌ ఒకటి వరకు వేసవి సెలవులుంటాయని ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని