పలు ఛానళ్లకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. కొన్ని టీవీ ఛానళ్లు, కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్‌ ఛానళ్లకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం లీగల్‌ నోటీసులు పంపించారు.

Updated : 31 Mar 2024 07:48 IST

తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: తనను, తన కుటుంబాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. కొన్ని టీవీ ఛానళ్లు, కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్‌ ఛానళ్లకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం లీగల్‌ నోటీసులు పంపించారు. అవి పక్కా ప్రణాళికతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్‌కు సైతం లీగల్‌ నోటీసులు పంపించినట్లు తెలిపారు. తనకు సంబంధమే లేని అనేక అంశాల్లో తన పేరును, ఫొటోలను వాడుకుంటున్న ఆ ఛానళ్లు.. దురుద్దేశ ప్రచారాంశాలను తొలగించకుంటే పరువు నష్టం కేసులు వేస్తానని వెల్లడించారు.

కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదు చేసి.. బంజారాహిల్స్‌ ఠాణాకు బదిలీ చేశారు. కేటీఆర్‌పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని