విభజన హామీలకు మ్యానిఫెస్టోలో చోటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశాలను కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది.

Updated : 31 Mar 2024 05:06 IST

మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కమిటీ భేటీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశాలను కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోలో చేర్చాలని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. కమిటీ ఛైర్మన్‌, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మ్యానిఫెస్టోలో పొందుపరచాల్సిన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపై చర్చించారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రధానంగా ప్రాంతీయ ఎయిర్‌ పోర్టులు, వరంగల్‌ ఎయిర్‌ పోర్టు ఆధునికీకరణ, సింగరేణి, రైల్వే, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక స్కూళ్లు, నవోదయ పాఠశాలలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. మ్యానిఫెస్టోను ఇంటింటికి చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. సమావేశంలో సభ్యులు జానయ్య, జనక్‌ ప్రసాద్‌, రియజుద్దీన్‌, వినోద్‌ కుమార్‌, శ్యాంమోహన్‌, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు