తెలంగాణ పదో తరగతి జీవశాస్త్ర ప్రశ్నపత్రంలో తప్పులు

పది పరీక్షల్లో ఈ నెల 28న నిర్వహించిన జీవశాస్త్ర పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. రెండు ప్రశ్నల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురై సమాధానాలను స్పష్టంగా రాయలేకపోయారు.

Published : 31 Mar 2024 05:03 IST

రెండు ప్రశ్నలపై విద్యార్థుల అయోమయం

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పది పరీక్షల్లో ఈ నెల 28న నిర్వహించిన జీవశాస్త్ర పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. రెండు ప్రశ్నల విషయంలో విద్యార్థులు అయోమయానికి గురై సమాధానాలను స్పష్టంగా రాయలేకపోయారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు నష్టపోయే అవకాశం ఉందని వారు తెలిపారు. ఆ ప్రశ్నలను పరిశీలిస్తే..

  • ప్రశ్నపత్రంలోని సెక్షన్‌-2 లో ఇచ్చిన 5వ ప్రశ్న ఆంగ్లమాధ్యమంలో ‘మీ దైనందిన జీవితంలో పరిశీలించిన ఏవేని రెండు కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహరణలతో రాయండి’ అని అడిగారు. కృత్రిమ ప్రత్యుత్పత్తి విధానాలు అంటే చాలా వస్తాయి. ఇదే ప్రశ్నను తెలుగులో మాత్రం ‘ఏవేని రెండు కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి’ అని అడిగారు. ప్రశ్న స్పష్టంగా లేకపోవడంతో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు అయోమయానికి గురై సరైన సమాధానం రాయలేకపోయారు.
  • ఇదే సెక్షన్‌లోని 6వ ప్రశ్నను బ్లూప్రింట్‌ విధానాన్ని అనుసరించి, 4వ విద్యా ప్రమాణానికి అనుకూలంగా అడగాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈ ప్రశ్నను రూపొందించడంతో తెలుగు, ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు గందరగోళానికి గురై సరైన జవాబు రాయలేకపోయారు. ఈ విషయాన్ని సబ్జెక్టు నిపుణుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు ఉన్నతాధికారులకు వివరిస్తామని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని