టెట్‌పై స్పష్టత ఇవ్వాలి

టెట్‌ విషయమై ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వాలని యూఎస్‌పీసీ, జాక్టో, పీఆర్‌టీయూటీఎస్‌, ఆర్‌యూపీపీటీఎస్‌ నాయకులు శనివారం డీఎస్‌ఈ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) కార్యాలయంలో అదనపు సంచాలకుడు లింగయ్యను కోరారు.

Published : 31 Mar 2024 03:11 IST

ఈనాడు,హైదరాబాద్‌: టెట్‌ విషయమై ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వాలని యూఎస్‌పీసీ, జాక్టో, పీఆర్‌టీయూటీఎస్‌, ఆర్‌యూపీపీటీఎస్‌ నాయకులు శనివారం డీఎస్‌ఈ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) కార్యాలయంలో అదనపు సంచాలకుడు లింగయ్యను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల సందేహాలపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలన్నారు.

పదోన్నతులకు మినహాయింపు ఇవ్వాలి

గ్రేడ్‌-1 భాషా పండితులు.. స్కూల్‌ అసిస్టెంటు (రెండోస్థాయి) పదోన్నతులు పొందడానికి టెట్‌ రెండోస్థాయి పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు నేతలు జగదీశ్‌, నర్సిములు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని