ఆశల పైరు.. ఎండిన తీరు

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రైతులు ఎల్లారెడ్డి, నారాయణరెడ్డిల పక్కపక్క పొలాలు ఇవి. వీరిద్దరూ డిసెంబరు చివర్లో ఒకేసారి వరి సాగు మొదలుపెట్టారు.

Published : 31 Mar 2024 03:11 IST

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రైతులు ఎల్లారెడ్డి, నారాయణరెడ్డిల పక్కపక్క పొలాలు ఇవి. వీరిద్దరూ డిసెంబరు చివర్లో ఒకేసారి వరి సాగు మొదలుపెట్టారు. ప్రస్తుతం నారాయణరెడ్డి పొలం పచ్చగా కనిపిస్తుంటే.. ఎల్లారెడ్డిది మాత్రం ఎండిపోయి ఉంది. దీనికి కారణం భూగర్భజలాలే. వర్షాలు సమృద్ధిగా కురవక జలాశయాలు అడుగంటుతున్నాయి. దీంతో జిల్లాలో చాలామంది రైతులకు బోరు నీళ్లే దిక్కయ్యాయి. మరో పది, పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా వట్టిపోయి పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. నారాయణరెడ్డి బోరు అరకొరగానైనా నీరు పోస్తుండగా.. ఎల్లారెడ్డి బోరు మాత్రం పూర్తిగా వట్టిపోయింది. చేసేది లేక పది రోజులుగా ఒకటిన్నర ఎకరాల్లోని వరి పైరును వదిలేశారు. కంకులు కనిపిస్తున్నా.. అంతా తాలు రావడంతో పశుగ్రాసానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోయిందని, సుమారు  రూ.70 వేలు నష్టపోయానని రైతు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, గోపాల్‌పేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు