పురుగు మందు అవశేషాలు లేని ఉత్పత్తులు రావాలి

పురుగు మందు అవశేషాలు లేని అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు అందించే దిశగా తెలంగాణ ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 31 Mar 2024 03:13 IST

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

శామీర్‌పేట, న్యూస్‌టుడే: పురుగు మందు అవశేషాలు లేని అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు అందించే దిశగా తెలంగాణ ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట జీనోమ్‌వ్యాలీ, కొల్తూరు పరిధిలోని ఏటీజీసీ బయోటెక్‌ అగ్రి ఇన్నోవేషన్‌ బ్లాక్‌-సి నిర్మాణానికి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ఏటీజీసీ సంస్థ పురుగు మందుల అవశేషాలు లేని పెస్టిసైడ్‌ను తయారు చేస్తున్నామని చెప్పడం అభినందనీయమన్నారు. ప్రొఫెసర్‌ అర్జుల రాంచంద్రారెడ్డి, ఏటీజీసీ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో వీబీ.రెడ్డిలు వ్యవసాయంలో క్రిమి సంహారక పురుగు మందులు, వాతావరణ మార్పులు, పర్యావరణ విధ్వంసం ఆపడానికి నూతన ఆవిష్కరణలకు కృషిచేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ రామచంద్రు తేజావత్‌, ప్రొఫెసర్‌ అప్పారావు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రైతు చింతల వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్‌ నీలిమ, ఏటీజీసీ బయోటెక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


మంత్రి తుమ్మలతో మలేసియా ప్రతినిధుల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: మలేసియా ఆయిల్‌పామ్‌ సొసైటీ ప్రతినిధులు అజర్‌ బిన్‌ అబ్దుల్‌ హమీద్‌, సయ్యద్‌ మహదర్‌ బిన్‌ హుస్సేన్‌ శనివారం హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ విస్తరణపై చర్చించారు. ఆయిల్‌పామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు, గార్డెన్ల ప్రారంభం, పంట సాగులో యాంత్రీకరణ, అధిక ఉత్పత్తుల కోసం మొక్కల పంపిణీ, నూతన సాంకేతికతతో శుద్ధి కర్మాగారం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని