రాష్ట్రానికి వడగాలుల హెచ్చరిక

రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే పరిస్థితులు(హీట్‌వేవ్‌ కండిషన్స్‌) ఉన్నట్లు శనివారం ప్రకటించింది.

Published : 31 Mar 2024 03:14 IST

నేటి నుంచి 3వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వీచే అవకాశం
ఇప్పటికే నల్గొండ జిల్లాలో నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే పరిస్థితులు(హీట్‌వేవ్‌ కండిషన్స్‌) ఉన్నట్లు శనివారం ప్రకటించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.

పసుపు రంగు హెచ్చరికలు

రాష్ట్రంలో 16 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటిసారి వడగాలులు నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. శనివారం వేములపల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా ఇక్కడ వడగాలులు వీస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఖమ్మంలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని