‘సమతామూర్తి’ సందర్శన వేళల్లో మార్పు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను వేసవి సెలవుల సందర్భంగా మార్చినట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 01 Apr 2024 05:03 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను వేసవి సెలవుల సందర్భంగా మార్చినట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. బుధవారం సెలవును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని