అక్రమంగా నిల్వ ఉంచిన ఔషధాల స్వాధీనం

డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ మందుల దుకాణాన్ని సీజ్‌ చేయడంతో పాటు క్లినిక్‌లలో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీజీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 Apr 2024 04:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్‌ లైసెన్స్‌ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ మందుల దుకాణాన్ని సీజ్‌ చేయడంతో పాటు క్లినిక్‌లలో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి (డీజీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్‌ జిల్లా నిజాంపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మందుల దుకాణాన్ని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్పందన క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 28 రకాల మందులను, నాగారంలోని శ్రీవెంకటేశ్వర క్లినిక్‌లో నిల్వ ఉంచిన 18 రకాల మందులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని