మోడల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు 7న పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ ఏడో తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Published : 01 Apr 2024 04:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ ఏడో తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి 12 వరకు, ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ప్రవేశ పరీక్ష రాసేందుకు 62,983 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ మొదటి తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని