దూరవిద్య పబ్లిక్‌ పరీక్షలు 6 నుంచి

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ (పదో తరగతి), సీనియర్‌ సెకండరీ (12వ తరగతి) పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి మే 22 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌ఐఓఎస్‌ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 Apr 2024 04:50 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) సెకండరీ (పదో తరగతి), సీనియర్‌ సెకండరీ (12వ తరగతి) పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి మే 22 వరకు నిర్వహించనున్నట్లు ఎన్‌ఐఓఎస్‌ ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్‌టికెట్లను ఎన్‌ఐఓఎస్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలకు 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని