పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం మార్గదర్శకాలు

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Published : 01 Apr 2024 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు ఎంపిక చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మాత్రమే ఓటు వేయాలని తెలిపింది. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు కోసం ఫారం-12 అందజేస్తామని, అందులో వారు తాము ఎక్కడ ఓటు వేయాలో ఎంచుకోవాలని సూచించింది. తాము ఓటరుగా నమోదైన నియోజకవర్గం లేదా విధులు నిర్వర్తించే నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని పేర్కొంది. ఉద్యోగి పేరు, ఎంప్లాయికోడ్‌, హోదా, శాఖ, మొబైల్‌ నంబరు, పనిచేస్తున్న నియోజకవర్గం, సొంత నియోజకవర్గం, దాని సంఖ్య, ఓటర్ల జాబితాలో నంబరు, గుర్తింపు కార్డు సంఖ్య వివరాలను సైతం ఫారం-12లో పొందుపరచాలని పేర్కొంది. పోస్టల్‌ ఓటు వేసే ఉద్యోగుల కోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలు తాత్కాలికంగా ఆర్‌వో/ఏఆర్‌వో కార్యాలయం, లేదా ఏదైనా ఇతర కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు సాధారణ సెలవుదినాన్ని మంజూరు చేస్తుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని