చేపల ఇళ్లు చూశారా..!

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె జలాశయంలో చేపలు ఏర్పాటు చేసుకున్న నివాసాలు ఇవి.

Published : 01 Apr 2024 04:51 IST

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె జలాశయంలో చేపలు ఏర్పాటు చేసుకున్న నివాసాలు ఇవి. తిలాఫియా (దూబొచ్చ) అనే రకం చేపలు సంతానోత్పత్తిని పెంచుకునేందుకు గుంతలు తవ్వుకొని అందులో గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటాయి. జలాశయంలో భారీగా నీటిమట్టం తగ్గడంతో అడుగు భాగంలో చేపలు తయారు చేసుకున్న నివాసాలు ఇలా బయటపడ్డాయి. వీటి గురించి జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప మాట్లాడుతూ తిలాఫియా చేపలు ఏడాదిలో మూడు సార్లు సంతానోత్పత్తిని పెంచుకునేందుకు రక్షణగా ఇలా నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయని తెలిపారు.

పెబ్బేరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని