సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే మార్గం

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే ఏకైక మార్గమని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్‌లు అన్నారు.

Published : 01 Apr 2024 04:52 IST

ఎస్టీయూటీఎస్‌ శిక్షణ శిబిరంలో నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే ఏకైక మార్గమని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్‌లు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరైన వారు మాట్లాడుతూ.. బదిలీ అయిన ఉపాధ్యాయులకు విద్యాసంవత్సరం చివరి రోజున విడుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, పదోన్నతులు, టెట్‌ ఉత్తీర్ణతపై సందేహాలు నివృత్తి చేయాలని, పెండింగు ఇళ్లు మంజూరు చేయాలని, మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించాలని, విద్యావాలంటీర్లు, సర్వీసు పర్సన్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీయూటీఎస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ..ఎస్టీయూకు 77 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని, 1958లో మొదటి పీఆర్‌సీ నుంచి ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి ఎన్నో సాధించిన ఏకైక సంఘం ఎస్టీయూ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నేత రమేశ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని