విరిగిన పట్టా.. తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ప్రమాదం తప్పింది. 2వ నంబరు ఫ్లాట్‌ఫారం చివరి భాగాన లూప్‌ లైనులో ఒకచోట పది అంగుళాల మేర పట్టా విరిగి అక్కడే ఉండిపోయింది.

Published : 01 Apr 2024 04:52 IST

ఆలేరు, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ప్రమాదం తప్పింది. 2వ నంబరు ఫ్లాట్‌ఫారం చివరి భాగాన లూప్‌ లైనులో ఒకచోట పది అంగుళాల మేర పట్టా విరిగి అక్కడే ఉండిపోయింది. ఉదయం 8.42 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళుతున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫ్లాట్‌ఫారానికి వస్తున్న క్రమంలో పట్టా విరిగిన చోట శబ్దం రావడాన్ని గమనించిన రైలు ప్రయాణికులు స్టేషన్లో రైలు ఆగిన వెంటనే గార్డుకు తెలిపారు. గార్డు స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సాంకేతిక, మరమ్మతుల విభాగం అధికారులు, సిబ్బంది గంట వ్యవధిలో మరమ్మతులు పూర్తిచేశారు. విరిగిన పట్టా భాగాన్ని తొలగించి తాత్కాలికంగా ఫిష్‌ప్లేట్‌ను అమర్చారు. ఈ ఘటన వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని, ఎండాకాలంలో ఇలాంటివి జరుగుతుంటాయని మరమ్మతు విభాగం అధికారులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని